‘తండేల్’ నుండి హైలెస్సో.. హైలెస్సా.. సాంగ్ రిలీజ్
హైదరాబాద్ (CLiC2NEWS): నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం వచ్చేనెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారం షురూ చేసింది. దీనిలో భాగంగా చిత్రంలోని హైలెస్సో. హైలెస్సా అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చుగా.. శ్రీమణి సాహిత్యం అందించారు. నకాష్, అజీజ్, శ్రేయా ఘోషల్ గాత్రమందించారు.