దక్షిణాది రాష్ట్రాలు ఎన్‌డిఎను ఆదరించాయి: మోడీ

ఢిల్లీ (CLiC2NEWS): ఎన్‌డిఎ పార్లమెంటరీ పార్టి సమావేశం శుక్రవారం ఢిల్లీలో నిర్వహించారు. ఎన్‌డిఎ నేతలు తమ లోక్‌సభా పక్ష నేతగా మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం మోడీ మాట్లాడుతూ.. మిత్రపక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్‌డిఎ అంటేనే సుపరిపాలన. మన కూటమి అసలైన భారత్ స్ఫూర్తిని చాటుతుందన్నారు. మనది అత్యంత విజయవంతమైన భాగస్వామ్య మని నరేంద్ర మోడీ అన్నారు. దక్షిణాది ప్రజలు ఎన్‌డిఎను ఆదరించారన్నారు
ఎపి ప్రజలు కూటమికి పెద్ద ఎత్తున మద్దతిచ్చారన్నారు. ఎపిలో ఇంత భారీ విజయం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందని ఆయన కొనియాడారు. కర్ణాటక, తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రాల్లోని ప్రజలు బిజెపికి అండగా నిలిచారన్నారు. తమిళనాడులో సీట్లు గెలవకపోయినా ఓట్లు పెరిగాయి. కేరళ నుండి తొలిసారి అక్కడి నుండి మా ప్రతినిధి సభలో అడుగుపెతున్నారన్నారు.