రేపే తెలంగాణలోకి నైరుతి ప్రవేశం

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రైతాంగానికి వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు సోమవారం ప్రవేశించే అవకాశాలున్నాయని పేర్కొంది. గోవా, కొంకణ్ , కర్ణాటక ప్రాంతాల్లో శనివారం నాటికి రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది. పశ్చిమ భారత తీర ప్రాంతాల్లో విస్తరించిన నేపథ్యంలో ఇవాళ, రేపు (ఆది, సోమవారం) తెలంగాణలోకి ప్రవేశించనున్నాయని అంచనా వేస్తున్నది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది.
మరో పక్క తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజధాని హైదరాబాద్‌లో ఎండలు భారీగానే ఉన్నాయి. దీంతో ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.