రైత‌న్న‌కు చ‌ల్ల‌ని క‌బురు

నైరుతి రుతుప‌వ‌నాలు వ‌చ్చేశాయ్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): భార‌త వాతావ‌ర‌ణ శాఖ రైత‌న్న‌ల‌కు చ‌ల్ల‌ని క‌బురు చెప్పింది. గురువారం నైరుతి రుతుప‌వ‌నాలు దేశంలోకి ప్ర‌వేశించాయి. ఈ మేర‌కు కేర‌ళ తీరాన్ని నైరుతి రుతుప‌వ‌నాలు తాకిన‌ట్లు ఐఎండి అధికారికంగా ప్ర‌క‌టించింది. మ‌న వాతార‌వ‌ణ శాఖ అధికారులు వేసిన అంచ‌నా కంటే రుతుప‌వ‌నాలు వారం రోజులు ఆల‌స్యంగా దేశంలోకి ప్ర‌వేశించాయి. రుపువ‌నాల రాక‌తో కేర‌ళ రాష్ట్రంలో 24 గంట‌ల నుంచి విస్తారంగా వాన‌లు కురుస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.