వినాయక నిమజ్జనానికి 535 ప్రత్యేక బస్సులు

హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్ మహానగరంలో గణేశ్ నిమజ్జనానికి దేశంలోనే ప్రత్యేక స్థానం. ముంబయి తర్వాత దేశంలో భాగ్యనగరంలో గణేశ నిమజ్జనోత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి. హైదరాబాద్‌లో ఈ నెల 28వ తేదీన గణేశ నిమజ్జనోత్సవాలు జరుగున్నాయనే విషయం తెలిసిందే. కాగా ఈ నిమజ్జనోత్సవాల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు టిఎస్ ఆర్టీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. వినాయక నిమజ్జనోత్సవాల వేళ భక్తుల సౌకర్యార్థం 535 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు టిఎస్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఒక ప్రకటనలో వెల్లడించారు. జిహెచ్ ఎం సి పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో తెలిపారు. నిమజ్జనోత్సవాల వేళ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంస్థ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బస్సుల వివారల కోసం రెతిఫైల్ బస్ స్టేషన్‌లో 9959226154, కోఠీ బస్ స్టేషన్‌లో 9959226160 నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.