నవంబర్ 10న ప్రత్యేక దర్శనం, శ్రీవాణి టికెట్లు, గదుల కోటా విడుదల..
తిరుమల (CLiC2NEWS): ఈ నెల 10వ తేదీన శ్రీవారి ప్రత్యేక దర్శనం, శ్రీవాటి టికెట్లు, గదుల కోటా విడుదల చేయనున్నట్లు టిటిడి ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ 23 నుండి జనవరి ఒకటో తేదీ వరకు వైకుంఠ ద్వారానికి సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, రూ. 10 వేల శ్రీవాణి టికెట్లు, గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. 2.25 లక్షల ప్రత్యేక దర్శనం టికెట్లు ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి టికెట్లు విడుదల చేయనున్నారు. రోజుకు 2 వేలు చొప్పున మొత్తం 20 వేల శ్రీవాణి టికెట్లు విడుదల చేస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు గదుల కోటాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.