రేపటి నుండి ‘స్పెషల్ గర్ల్ చైల్డ్’ స్కాలర్‌షిప్ స్కీమ్ దరఖాస్తులు ప్రారంభం
గోల్డెన్ జూబ్లీ స్కాలర్ షిప్ స్కీమ్ 2024
LIC: ఇంటర్మీడియట్ / 10+2/ ఏదైనా విభాగంలో డిప్లొమో కోర్సు పూర్తి చేయాలనుకునే వారికి ఉపకారవేతనం అందిస్తున్నారు. స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ స్కీమ్‌ను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( ఎల్ఐసి) అందిస్తోంది. ఈ స్కాలర్ షిప్ కు ఈ నెల 8వ తేదీ నుండి 22 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పథకం ద్వారా రెండేళ్ల పాటు ప్రత్యేక ఉపకారవేతనం అందుతుంది. కుటుంబ అర్హత, ఎంత మొత్తంలో స్కాలర్ షిప్ అందనుందనే పూర్తి విషయాలకు ఎల్ఐసి అధికారిక వెబ్‌సైట్ సంప్రదించగలరు.
గోల్డెన్ జూబ్లీ స్కాలర్ షిప్ స్కీమ్ 2024
2024-25 విద్యాసంవత్సరంలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే బాలబాలికలకు ఎల్ఐసి ఈ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్‌ను అందిస్తుంది. 2021-22, 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల్లో పదోతరగతి / ఇంటర్మీడియట్/ డిప్లమో పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ ఉపకారవేతనానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోగలరు. మెడిసిన్, ఇంజినీరింగ్, గ్రాడ్యుయేషన్ , ఏదైనా విభాగంలో డిప్లొమో , వొకేషన్ కోర్సులు, ఐటిఐ విద్యకు ఈ నగదు భరోసా కల్పించనున్నారు. ఈ విషయాన్ని ఎల్ఐసి
మీడయా సోషల్ వేదికగా వెల్లడించింది.