న‌ల్గొండ అభివృద్ధికి ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌

న‌ల్గొండ (CLiC2NEWS): ప‌ట్ట‌ణ అభివృద్ధికి ప్ర‌త్యేక ప్ర‌ణాళిక రూపొందించాల‌ని అధికారుల‌ను సిఎం కెసిఆర్ ఆదేశించారు. ముఖ్య‌మంత్రి న‌ల్గొండ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బుధ‌వారం జిల్లా క‌లెక్ట‌రేట్‌లో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సిఎం మాట్లాడుతూ.. న‌ల్గొండ పట్ట‌ణంలో రెండు ఇంటిగ్రేటెడ్ సూప‌ర్ మార్కెట్స్ ఏర్పాటుకు, పాన‌గ‌ల్ రిజ‌ర్వాయ‌ర్‌ను ట్యాంక్ బండ్‌, శిల్ప‌స‌క‌ళా తోర‌ణం ఏర్పాటుకు ప్ర‌ణాలళిక‌లు రూపొందించాల‌ని సిఎం ఆదేశాలు జారీ చేశారు. రూ.36 కోట్ల‌తో నిర్మించ‌బోయే డిగ్రీ క‌ళాశాల భవ‌‌న నిర్మాణానికి గురువారం జిఓ జారీ చేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ప‌ట్ట‌ణంలో రోడ్ల వెడ‌ల్పు, నూత‌న టౌన్‌హాల్ నిర్మాణానికి అవ‌స‌ర‌మైన నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు. ఈ స‌మావేశంలో మంత్రులు హ‌రీశ్‌రావు, జ‌గ‌దీశ్‌రెడ్డి, ఎంపిలు సంతోష్‌కుమార్‌, బ‌డుగుల లింగ‌య్య యాద‌వ్‌, ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాకు చెందిన టిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, న‌ల్గొండ క‌లెక్ట‌ర్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.