కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి టెంపుల్లో కెసిఆర్ ప్రత్యేక పూజలు

సిద్దిపేట (CLiC2NEWS): సిద్దిపేట జిల్లాలోని కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం కోనాయిపల్లి గ్రామంలోని వేంకటేశ్వర స్వామి వద్ద నామినేషన్ పత్రాలతో పూజలు నిర్వహించారు. కాగా ప్రతి సారి ఎన్నికల సమయంలో నామినేషన్ దాఖలుకు ముందు ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం అనవాయితీగా వస్తోంది. ఈ సారి ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా 9వ తేదీన గజ్వేల్లో ఉదయం, కామారెడ్డిలో మధ్యాహ్నం సిఎం కెసిఆర్ నామినేషన్ వేయనున్నారు. దీనిలో భాగంగా ఇవాళ ఉదయం కెసిఆర్ ఎర్రవల్లిలోని వ్యవసాయం క్షేత్రం నుంచి రోడ్డు మార్గం ద్వారా కోయినాయిపల్లికి చేరుకున్నారు. నామ పత్రాలు స్వామి వారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.