కాచిగూడ నుండి కాకినాడ‌కు ప్ర‌త్యేక రైలు

 హైదరాబాద్ (CLiC2NEWS)‌: ద‌క్షిణ మ‌ధ్య రైల్వే శుక్ర‌వారం రాత్రి 9 గంట‌ల‌కు కాచిగూడ నుంచి కాకినాడకు ప్రత్యేక రైలు నడుపుతున్నది. ప్రయాణికుల రద్దీ ఎక్క‌వ‌వుతుండ‌డంతో ‌ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్రత్యేక రైలు న‌డ‌ప‌డానికి నిర్ణ‌యించింది. ఈ రైలు కాచిగూడ నుంచి బయలుదేరి నల్లగొండ, విజయవాడ, భీమవరం, రాజమహేంద్రవరం మీదుగా కాకినాడకు చేరుతుందని అధికారులు వెల్లడించారు. ప్రత్యేక రైలులో ముందస్తు రిజర్వేషన్‌ చేసుకునే అవకాశం కల్పించామని, ప్రయాణికులు దీనిని ఉపయోగించుకోవాలని తెలిపారు. , ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ధరను కూడా రూ.10కు తగ్గించారు.  గతంలో కరోనా సమయంలో ప్లాట్‌ఫామ్‌ ధరలను రైల్వే శాఖ పెంచిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.