సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులతో ప్రత్యేక ధర్మాసనం
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/Special-Womens-Bench-in-Supreme-Court.jpg)
ఢిల్లీ (CLiC2NEWS): దేశ అత్యున్నత న్యాయస్థానంలో మహిళా జడ్జ్‌లతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు చరిత్రలో ప్రత్యేక బెంచ్‌ని ఏర్పాటు చేయడం ఇది మూడో సారి. మొదటిసారిగా 2013లో మహిళా ధర్మాసనం ఏర్పాటు చేశారు. న్యాయమూర్తులు జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బేలా ఎం త్రివేది తో కూడిన ధర్మాసనాన్ని కోర్టు నంబర్ 11లో సిజెఐ డి వై చంద్రచూడ్ ఏర్పాటు చేశారు. ఈ ధర్మాసనం వివాహ వివాదాలు, బెయిలుకు సంబంధించిన బదిలీ పిటిషన్లను విచారించనుంది. సుప్రీంకోర్టులో మొదటిసారిగా జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్ర, జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్‌లతో ధర్మాసనం ఏర్పాటు చేశారు. 2018లో రెండవసారి జస్టిస్ ఆర్. భానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన మహిళా ధర్మాసనం ఏర్పాటు చేశారు.