నాబార్డ్‌లో స్పెషలిస్ట్ పోస్టులు.. లక్షల్లో జీతం

NABARD: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవెలప్‌మెంట్ (NABARD) , ముంబయి ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నది. ఏప్రిల్ 6వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక జరుగుతుంది.
ఎంపికైన అభ్యర్థులకు లక్షల్లో జీతం అందుతుంది.
సిఐఎన్ ఒ పోస్టులు -1
ఈ పోస్టుకు ఎంపికైన వారికి ఏడాదికి వేతనం రూ. 50-70 లక్షలు అందుతుంది. అభ్యర్థుల వయస్సు 45 నుండి 55 ఏళ్లు ఉండాలి.
క్లైమేట్ చేంజ్ స్పెషలిస్ట్ – మిటిగేషన్-1
క్లైమేట్ చేంజ్ స్పెషలిస్ట్ – అడాప్షన్ -1
ఈ రెండు పోస్టులకు ఎంపికైన వారికి ఏడాదికి రూ25 లక్షల నుండి రూ.30లక్షల వరకు అందుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 35 నుండి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
కంటెంట్ రైటర్-1
గ్రాఫిక్ డిజైనర్ -1
ఈ రెండు పోస్టులకు వేతనం రూ.12లక్షలు అందుతుంది. అభ్యర్థుల వయస్సు 31 నుండి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బిఇ/ బిటెక్, ఎంఇ / ఎంటెక్, బిసిఎ, ఎంసిఎ, పిజి , పిజి డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ఉద్యోగానుభవం తప్పనిసరి.1
దరఖాస్తు ఫీజు రూ. 850 గా ఉంది. ఎస్‌సి/ ఎస్‌టి / దివ్యాంగులకు రూ.150గా ఉంది.