JNTU: ఈ నెల 26 నుండి మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్స్
హైదరాబాద్ (CLiC2NEWS): జెఎన్‌టియులో మిగిలిన ఇంజినీరింగ్ సీట్ల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 26నుండి జెఎన్‌టియుహెచ్ అనుబంధ కళాశాలల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయనున్నారు. వర్సిటి క్యాంపస్‌తో సహా మొత్తం 8 కళాశాలల్లో 978 సీట్లు మిగిపోయాయి. వీటిలో జెఎన్‌టియు క్యాంపస్‌లో 23 ఉండగా.. మెటలర్జికల్ ఇంజినీరింగ్‌లో 13 సీట్లు ఉన్నాయి.
కళాశాలల్లో ప్రవేశాలకు వర్సిటి ప్రవేశాల విభాగంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. విద్యార్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరుకావాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ జరిగే తేదీలు:
26వ తేదీన జెఎన్‌టియు క్యాంపస్, సుల్తాన్‌పూర్
28వ తేదీన జగిత్యాల, మంథని
29న వనపర్తి, రాజన్న సిరసిల్ల, పాలేరు, మహబూబాబాద్
[…] […]