అంత‌ర్జాతీయ క్రికెట్‌కు  వీడ్కోలు చెప్పిన శ్రీ‌శాంత్..

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లుకుతున్న‌ట్లు టీమ్ ఇండియా పేస‌ర్ శ్రీ‌శాంత్ తెలిపాడు.  ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుండి శ్రీ‌శాంత్ త‌ప్పుకుంటున్నట్లు ట్విట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించాడు. టీమిండియాకు ప్ర‌తినిధ్యం వ‌హించ‌డం గొప్ప వ‌ర‌మ‌ని, ఆ స్థాయికి చేరేందుకు స‌హ‌క‌రించిన కుటుంబ స‌భ్య‌ల‌కు, జ‌ట్టు స‌హ‌చ‌రుల‌కు, శ్రేయోభిలాషుల‌కు ధ‌న్య‌వాదాలు అని ట్వీట్ చేశాడు.

శ్రీ‌శాంత్  2013 ఐపిఎల్ సీజ‌న్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్ప‌డిన కేసులో దోషిగా తేల‌డంతో బిసిసిఐ ఏడేళ్లు నిషేధం విధించింది. 2020 సెప్టెంబ‌రు నాటికి ఏడేళ్లు పూర్త‌యినా..  అత‌డికి భార‌త జ‌ట్టు త‌రుపున ఆడే అవ‌కాశాలు రాలేదు. ఇటీవ‌ల జ‌రిగిన ఐపిఎల్ వేలంలోనూ శ్రీ‌శాంత్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజీ ముందుకు రాలేదు.

Leave A Reply

Your email address will not be published.