శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు
హైదరాబాద్ (CLiC2NEWS): దేశ వ్యాప్తంగా ప్రజలు శ్రీ కృష్ణాష్టమి ఘనంగా జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటా ఓ కృష్ణుడు వెలిశాడు. తల్లులు తమ పిల్లలను కృష్ణుడిగా అలంకరించి మురిశారు. తమ చిన్నారులకు గోపికల వేషధారణ వేసి వారితో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. విద్యాలయాల్లో సైతం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కృష్ణుడు, గోపికల వేషధారణలతో విద్యార్థులను అలంకరించారు. అనంతరం ఉట్టికొట్టి సంబరాలు జరుపుకున్నారు. కృష్ణుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.


[…] శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు […]
[…] శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు […]