తిరుప‌తి టు అయోధ్య ర‌థ‌యాత్ర‌.. కంచి పీఠాధిప‌తి విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి

తిరుప‌తి (CLiC2NEWS): తిరుప‌తి నుండి ఆయోధ్య‌కు శ్రీ‌రామ యంత్ర ర‌థ‌యాత్ర ప్రారంభించిన‌ట్లు కంచి మ‌ఠం పీఠాధిప‌తి విజ‌యేంద్ర స‌రస్వ‌తి స్వామిజీ వెల్ల‌డించారు. ఈ నెల 27 నుండి న‌వంబ‌ర్ 17 వ‌ర‌కు శ్రీ‌వారి క్షేత్రం తిరుప‌తి నుండి ఆయోధ్య వ‌ర‌కు 1800 కిలోమీట‌ర్లు మేర ర‌థ‌యాత్ర సాగుతుంది. పురాత‌న‌మైన కంచిమ‌ఠంలో శ్రీ‌రాముడి మూల యంత్రం ఉంద‌ని, పురాత‌న మ‌హా యంత్రం లాగానే నూత‌నంగా యంత్రాన్ని త‌యారు చేయించామ‌ని తెలిపారు. ఆయోధ్య‌లోని రామాల‌య స‌న్నిధిలో ఈ శ్రీ‌రామ యంత్రిన్ని ప్ర‌తిష్టించ‌నున్న‌ట్లు తెలిపారు. ఇప్ప‌టికే బాల రాముడి మూల విరాట్ కింద విగ్ర‌హ ప్ర‌తిష్ట స‌మ‌యంలో బంగారు రామ యంత్రాన్ని ఉంచార‌ని తెలిపారు.

తిరుప‌తి ఇస్కాన్ రోడ్డులో ఉన్న కంచి మ‌ఠంలో శ్రీ‌రామ యంత్రానికి స్వామీజీ పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. శ్రీ‌రామ యంత్ర రథాన్ని టిటిడి జెఇఒ వీర‌బ్ర‌హ్మంతో క‌లిసి స్వామిజి జెండా ఊపి ప్రారంభించారు. 45 రోజులు మండ‌ల దీక్ష అనంత‌రం అయోధ్య‌లో జ‌న‌వ‌రి 1న ల‌క్ష చండీ యాగం జ‌రుగుతుంద‌ని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.