భద్రాద్రిలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం..

భద్రాద్రి (CLiC2NEWS): భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. మిథిలా మైదానంలో ఈ కల్యాణ క్రతువును పండితులు శాస్త్రోక్తంగా కనులపండుగగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు స్వామివారికి సమర్పించారు. సింతో పాటు డిప్యూటి సిఎం, భట్టి విక్రమార్క, మంత్రులు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.