ఈ నెల 11 నుండి నగరంలో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు

హైదరాబాద్ (CLiC2NEW): అక్టోబర్ 11వ తేదీ నుండి హైదరాబాద్‌లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలను జరగనున్నాయి. తిరుమలలో శ్రీవారికి జరిగే నిత్య వారసేవలు, ఉత్సవాలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు కూడా దర్శించేందుకు వీలుగా టిటిడి ఆయ ప్రాంతాల్లో వైభవోత్సవాలను నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని ఎన్‌టిఆర్ స్టేడియంలో ఈ ఉత్సవాలను ఐదు రోజుల పాటు నిర్వహించనున్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.
ఈ నెల 10వ తేదీన శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. 11న వసంతోత్సవం, 12న సహస్ర కలశాభిషేకం, 13న తిరుప్పావడ, 14న నిజపాద దర్శనం, 15వ తేదీ సాయంత్రం శ్రీనివాస కల్యాణం జరుగుతుందని వివరించారు.
Your article helped me a lot, thanks for the information. I also like your blog theme, can you tell me how you did it?