రేపు శ్రీ‌నివాస దివ్యానుగ్ర‌హ విశేష‌హోమం టికెట్లు విడుద‌ల‌..

తిరుమ‌ల (CLiC2NEWS): న‌వంబరు 23వ తేదీ నుండి అలిపిరిలోని స‌ప్త గోప్ర‌ద‌క్షిణ మందిరంలో శ్రీ‌శ్రీ‌నివాస దివ్యానుగ్ర‌హ విశేష హోమం నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం టిటిడి ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. దీనికోసం టికెట్ల‌ను రేపు మ‌ధ్యాహ‌నం 2 గంట‌లకు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. హిందూ స‌నాత‌న ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా ఈ అలిపిరిలో ఈ హోమం జ‌ర‌ప‌నున్న‌ట్లు పేర్కొన్నారు. టికెట్ ధ‌ర రూ. వెయ్యిగా నిర్ణ‌యించారు. అయితే ఒక‌ టికెట్‌పై ఇద్ద‌రిని అనుమ‌తినిస్తారు. బుధ‌వారం హోమం ఏర్పాట్లను జెఇఒ వీర‌బ్ర‌హ్యం పరిశీలించారు. హోమం నిర్వ‌హ‌ణ‌కు, వ‌చ్చే భ‌క్తుల‌కు కూర్చునేందుకు వీలుగా త‌గు ఏర్పాట్ల‌ను చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.