శ్రీరామని పట్టాభిషేకం.. ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల

భద్రాచలం (CLiC2NEWS): శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి సంబంధించిన టికెట్లను గురువారం ఆన్‌లూన్‌లో విడుదల చేయనున్నట్లు భద్రాద్రి ఆలయ అధికారులు వెల్లడించారు. కొవిడ్ కారణంగా రెండు సంవత్సరాలుగా భక్తులు లేకుండా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో స్వామి వారి కళ్యాణాన్ని భక్తుల నడుమ వైభవంగా నిర్వహించాలని ఈఓ ఇదివరకే వెల్లడించారు . ఈ మేరకు గురువారం టికెట్లను విడుదల చేయనున్నారు. భక్తులు టికెట్లను www.bhadrachalamonline.com వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని ఈఓ తెలిపారు. ఏప్రిల్ 2 నుండి 16వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. 10వ తేదీన సీతారాముల కల్యాణ మహోత్సవం, 11వ తేదీన మహా పట్టాభిషేకం అనంతరం రథోత్సవం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 11వ తేదీన నిర్వహించనున్న పట్టాభిషక మహోత్సవానికి టికెట్లు బుక్ చేసుకోవాలని ఆలయ ఈఓ సూచించారు.