2024 జనవరి నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల..

తిరుమల (CLiC2NEWS): 2024 జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 18 నుండి విడుదల చేయనున్నట్లు టిటిడి ప్రకటన చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్యారాధన, ఆర్జిత సేవల కు సంబంధించిన టికెట్లను విడుదల చేయనున్నారు. అక్టోబర్ 18 ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం10 గంటల వరకు ఆన్‌లైన్ లక్కీడిప్ కోసం నమోదు చేసుకోగలరు. ఈ లక్కీడిప్ ద్వారా టికెట్లు పొందిన వారు అక్టోబర్ 22 మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాలి.
అక్టోబర్ 21వ తేదీన కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్లను విడుదల చేయనున్నారు. అక్టోబర్ 21 ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల చేయనున్నారు.
అంగ ప్రదక్షిణం టోకెన్లను అక్టోబర్ 23 ఉదయం 10 గంటలకు.. శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, గదుల కోటాను ఉదయం 11 గంటలకు.. వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.
అంతేకాకుండా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం అక్టోబర్ ఉదయం 10 గంటలకు.. అక్టోబర్ 25 ఉదయం 10 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ టికెట్లను విడుదల చేస్తారు.