రెండేళ్ల తర్వాత భక్తుల సమక్షంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల (CLiC2NEWS): ఈ నెల 27 నుండి తిరుమల బ్రహ్మోత్సవలు ప్రారంభం కానున్నాయి.
భక్తుల సమక్షంలో తిరుమల బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సన్నాహాలు చేస్తుంది. కొవిడ్ కారణంగా రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ భక్తుల మధ్య స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. సెప్టెంబరు 20వ తేదీన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. సెప్టెంబరు 27వ తేదీ నుండి అక్టోబరు 5వ తేదీ వరకు ఆలయ మాడ వీధుల్లో వాహన సేవలు జరుగుతాయి. 27న శ్రీవారికి ఎపి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించనున్నారు. విఐపి బ్రేక్, శ్రీవాణి ట్రస్టు దర్శనాలన్నీ రద్దు చేశారు.