శ్రీవారి సర్వ దర్శనాలు పున: ప్రారంభం!

రేప‌టి నుంచి శ్రీ‌వారి సర్వదర్శనం టోకెన్ల జారీ

తిరుమ‌ల (CLiC2NEWS): శ్రీవారి భక్తులకు శుభ‌వార్త. రేప‌టి (బుధవారం) నుంచి సర్వదర్శనం పునఃప్రారంభించనున్నట్లు టిటిడి ప్రకటించింది. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 8 ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపింది. రోజుకి 2 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.

అలిపిరి లోని భూదేవి కాంప్లెక్స్ లోని కౌంటర్లలో చిత్తూరు జిల్లాకు చెందిన వారికి మాత్రమే ప్రయోగాత్మకంగా టోకెన్లు జారీ చేస్తారని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. త్వరలోనే మిగతా జిల్లాల వారికి కూడా టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ తెలిపింది. కాగా, కరోనా కారణంగా 6 నెలల నుంచి సర్వదర్శనాలను టీటీడీ నిలిపివేసిన సంగతి విదితమే. మరోవైపు రూ. 300 స్పెషల్ దర్శనం టికెట్లు ఉన్నవారిని, సిఫార్సు లేఖల ద్వారా వచ్చే భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతిస్తూ వచ్చింది. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ టోకెన్లు పొందేందుకు సహకరించాలని టీటీడీ విజ్ఞపి చేస్తోంది.

Leave A Reply

Your email address will not be published.