ఈనెల 12వ తేదీ నుండి శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు విడుదల
![](https://clic2news.com/wp-content/uploads/2022/08/ttd-devotees-traffic.jpg)
తిరుమల (CLiC2NEWS): తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) వారు జనవరి 12వ తేదీనుండి స్వామి వారి సర్వదర్శనం టికెట్లను జారీ చేయనున్నట్లు తెలిపారు. ఏరాజుకారోజు దర్శనానానికి సంబంధించిన నిర్దేశిత టోకెన్లను భక్తులకు అందుబాటులో ఉంటాయని టిటిడి తెలిపింది. తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీగోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసంలో టోకెన్లు జారీ చేయనున్నారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అన్న ప్రసాదాలను అందించే ఎస్‌వి అన్న ప్రసాదం ట్రస్టుకు ఒకరోజు విరాళ పథకం కింద రూ. 33 లక్షలు అందించవచ్చని టిటిడి ఓ ప్రకటనలో తెలిపింది. ఉదయం అల్పాహారం కోసం రూ. 7.70 లక్షలు, మధ్యాహ్న భోజనం రూ. 12.65 లక్షలు, రాత్రి భోజనానికి రూ. 12.65 లక్షలు అందించవచ్చాని తెలిపింది. అదేవిధంగా దాతలు స్వయంగా భక్తులకు అన్న ప్రసాదాలను వడ్డించవచ్చని తెలిపారు.