ఎన్‌టిఆర్ స్టేడియంలో శ్రీవారి వైభవోత్సవాలు

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని ఎన్‌టిఆర్ స్టేడియంలో శ్రీవెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం స్వామివారికి సుప్రభాతం, తోమాల సేవ, కొలువు, అర్చన, నివేదన, శాత్తుమొర, అభిషేకసేవలు నిర్వహించారు. ప్రతి శుక్రవారం తిరుమల దేవస్థానంలో నిర్వహించే విధంగా సుమారు గంటపాటు అభిషేకం చేశారు. ఈరోజు ఉదయం 10 నుండి 12 గంటల వరకు నిజపాదర్శనం కల్పించారు. భక్తులు విశేష సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించి తరించారు. భక్తులకు శ్రీవేంకటేశ్వర సుప్రభాతం, గోవిందనామాల పుస్తాకానలు అందజేశారు.