గుడ్‌న్యూస్: టెన్త్ అర్హతతో 25,271 కానిస్టేబుల్ ఉద్యోగాలు

హైదరాబాద్ (CLiC2NEWS): నిరుద్యోగులకు శుభవార్త. సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, సెక్రటేరియల్ సెక్యూరిటీ ఫోర్స్, రైఫిల్‌మెన్ ఇన్ అసోం రైఫిల్స్‌లో కానిస్టేబుళ్ల నియమకాలకు తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ దరఖాస్తుల ప్రక్రియ జూలై 17 నుంచి ప్రారంభం కానున్నాయి. దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 31 వరకు ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. ఆసక్తిగలవారు ssc.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉన్న గ్రేడ్ 3 స్థాయి వేతనం లభిస్తుంది.
మొత్తం 25,271 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
- దరఖాస్తులు ప్రారంభం (ఆన్‌లైన్): జూలై 17
- దరఖాస్తుల గడువు తేదీ: ఆగస్టు 31
- ఫీజు చెల్లించాల్సిన చివరి తేదీ (ఆన్‌లైన్‌లో): సెప్టెంబర్ 2
- ఆఫ్‌లైన్ చలాన్ చివరి తేదీ : సెప్టెంబర్ 4
- చలాన్ ద్వారా ఫీజు చెల్లింపు (బ్యాంకు సమయాల్లో): సెప్టెంబర్ 7
Tq