నింగిలోకి దూసుకెళ్లిన ఎస్.ఎస్.ఎల్.వి-డి2

శ్రీహరికోట (CLiC2NEWS): తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఎస్.ఎస్.ఎల్.వి-డి2 నింగిలోకి దూసెకెళ్లింది. శుక్రకవారం తెల్లవారు జామున గం.2.48 కి కౌంట్ డౌన్ మొదలై… 6.30 గంటల పాటు కొనసాగింది. అనంతరం ఉదయం 9.18 నిమిషాలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఎస్.ఎస్.ఎల్.వి-డి2 నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు.
ఎస్.ఎస్.ఎల్.వి-డి2 ద్వారా షార్‌కు చెందిన 156.3 కిలోల బరువైన ఇఒఎస్-07 ఉపగ్రహంతో పాటు యుఎస్ ఎ అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల జానుస్-1, అలాగే సర్కార్ పాఠశాల బాలికలు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీశాట్-2 భూసమీప కక్ష్యలో ప్రవేశపెట్టారు.