26,146 కానిస్టేబుల్ పోస్టులు.. పది పాసైతే రూ. 40వేలు వేతనం..

Job News (CLiC2NEWS): స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కేంద్ర సాయుధ దళాల్లో కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు పదోతరగతి ఉత్తీర్ణులైతే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ బేసిడ్ పరీక్ష, దేహదారుడ్య, శారీరక ప్రమాణ, మెడికల్ టెస్టులతో ఎంపిక జరుగుతుంది. ఎంపిక అభ్యర్థులు శిక్షణ పూర్తయిన అనంతరం రూ. 40 వేల జీతం అందుతుంది. అభ్యర్థులు వయస్సు 18 నుండి 23 ఏళ్ల లోపు ఉండాలి. జనవరి 2, 2001 నుండి జనవరి 1, 2006 మధ్య జన్మించిన వారు అర్హులుగా నిర్ణయించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుం రూ. వంద గా నిర్ణయించారు. మహిళలకు, ఎస్ సి, ఎస్‌టి లకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.