Telangana: రాష్ట్ర మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు..
అటవీశాఖ ఉద్యోగాల్లో పలు విభాగాల్లో రిజర్వేషన్లు అమలు!
హైదరాబాద్ (CLiC2NEWS): ఫారెస్ట్ డిపార్టుమెంట్ ఉద్యోగాల భార్తీ విషయంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద పలు విభాగాల్లో రెజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశమైన కేబినేట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
తెలంగాణలో అటవీ విశ్వద్యాలయం ఏర్పాటుకు ఆమోదం
యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు బిఎస్సి (ఫారెస్ట్రి) కోర్సు చేసిన వారికి అటవీ శాఖ ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. సిద్ధిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (FCRI) లో బిఎస్సి ఫారెస్ట్రి (హానర్స్) నాలుగేండ్ల డిగ్రీ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు అటవీ శాఖ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉద్యోగాల్లో 25%, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విభాగలో 50%, ఫారెస్టర్స్ ఉద్యోగాల్లో 50% రెజర్వేషన్లు కల్పించాలని తీర్మానించారు.