రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సిఎం కెసిఆర్

హైదరాబాద్(CLiC2NEWS) : కరోనా ఉధృతి పెరుగుతున్నందున రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, స్వీయ నియంత్రణా చర్యలను పాటించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్ ఆదివారం రాష్ట్రంలో కారోనా పరిస్థితి-వైద్యారోగ్యశాఖ అప్రమత్తతపై సమీక్ష నిర్వహించారు.
ప్రజలెవ్వరూ భయాందోళనలకు గురికావల్సిన అవసరం లేదని, కానీ అశ్రద్ధ మాత్రం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ విధిగా టీకా వేయించుకోవాలని, 15 – 18 సంవత్సరాల పిల్లలకు టీకా వేయించాలన్నారు. రేపటినుండి 60 సంవత్సరాల వయసు పైబడిన వారికి, ఫ్రంట్‌లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్లకు బూస్టర్ డోసును ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు, సంక్రాంతి పండుగ దినాలలో జనం గుమిగూడకుండా ఎవరి ఇళ్లల్లో వారు పండుగ జరుపుకోవాలని సిఎం సూచించారు.