100% వ్యాక్సినేషన్ పూర్తి చేసిన రాష్ట్రం.. టీకా కేంద్రాలు మూసివేత!
పనాజి (CLiC2NEWS): దేశంలోని అన్ని రాష్ట్రాలలో కరోనా వ్యాక్సిన్ తొలి డోసు పంపిణీ పూర్తవ్వగా.. రెండో డోసు పంపిణీ కొనాసాగుతుంది. గోవా రాష్ట్రం 100% అర్హలకు రెండు డోసుల టీకా పంపిణీ పూర్తి చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యాక్సిన్ సెంటర్‌లను తాత్యాలికంగా మూసివేసినట్లు ఆరాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. సాధారణ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా కొవిడ్ వ్యాక్సిన్ అందించే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపింది.
రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ అర్హలైన వారందరికీ గత సంవత్సరం సెప్టెంబరులోనే తొలి డోసు అందించాం. రాష్ట్రంలో అర్హలైన వారందరికీ రెండు డోసుల పంపిణీ పూర్తి చేశాం. ఈఘనత సాధించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని గోవా స్టేట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ రాజేంద్ర బోర్కర్ పేర్కొన్నారు.