తెలంగాణ టూరిజం ప్ర‌త్యేక ప్యాకేజి మీకోసం..

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప్ర‌సిద్ధ షిర్ఢీ ఆల‌యంకు వెళ్లాల‌నుకునే భ‌క్తుల‌కు తెలంగాణ టూరిజం ప్ర‌త్యేక ప్యాకేజీని అందించ‌నుంది. హైద‌రాబాద్ నుండి షిర్డీ మందిరంకు ప్ర‌త్యేక పాకేజీతో ఎసి, నాన్ ఎసి బ‌స్సుల‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎసి బ‌స్సుల‌లో పెద్ద‌వారికి రూ. 3,700, పిల్ల‌ల‌కు రూ. 3,010 ఛార్జ్ వ‌సూలు చేయ‌నున్నారు. నాన్ ఎసిల‌లో అయితే పెద్ద‌ల‌కు రూ. 2,400, పిల్ల‌ల‌కు రూ. 1,970 గా నిర్ణ‌యించారు. హోట‌ల్ రూమ్ కూడా తెలంగాణ టూరిజ‌మే అందించ‌నుంది. ద‌ర్శ‌నం టికెట్లు, భోజ‌న స‌దుపాయాల ఖ‌ర్చు ప్యాకేజీలోకి రాదు.

హోట‌ల్ నుండి ఆల‌యంకు బ‌స్సుల‌లో తీసుకెళ్తారు. సాయి ద‌ర్శ‌నం అనంత‌రం షిర్డీ స‌మీపంలోని దేవాల‌యాల‌కు తీసుకెళ్తారు. అదే రోజు సాయంత్రం 4 గంట‌ల‌కు షిర్డీ నుండి తిరిగి హైద‌రాబాద్‌కు బ‌స్సు బ‌య‌లు దేరి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6.30 గంట‌ల‌కు చేరుతుంది. ఈ ప్యాకేజి బ‌స్సుల కోసం న‌గ‌రంలోని దిల్‌సుఖ్ న‌గ‌ర్, భషీర్‌బాగ్‌, ప్యార‌డైస్‌, బేగంపేట్‌, కెపిహెచ్‌బి, మియాపూర్ ల‌లో టూరిజం బ‌స్సులు అందుబాటులో ఉంటాయి. పూర్తి వివ‌రాల‌కు https://tourism.telangana.gov.in/package/ShirdiTour వెబ్‌సైట్ చూడ‌వ‌చ్చు.

Leave A Reply

Your email address will not be published.