ఈ నెల 29న ‘దీక్షా దివస్’కు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు: కెటిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో ఈ నెల 29వ తేదీన దీక్షా దివస్ ఘనంగా నిర్వహించాలని బిఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ పార్టి శ్రేణులకు పిలుపునిచ్చారు. 2009 నవంబర్ 29వ తేదీన కెసిఆర్ ఆమరణ నిరాహా దీక్ష ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆయన చేపట్టిన ఈ దీక్ష మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి స్వారాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసిందని కెటిఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా దీక్షా దివస్ నిలుస్తుందన్నారు. ఇది యావత్ భారతదేశ రాజకీయ వ్యవస్థను కదిలించిందన్నారు. దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిందన్నారు. కరీంనగర్‌లో నిర్వహించబోయే దీక్షా దివస్ కార్యక్రమంలో కెటిఆర్ పాల్గొననున్నట్లు సమాచారం.