గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత..
విశాఖ (CLiC2NEWS): బొగ్గు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ.. యాజమాన్యంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళనకు దిగారు. గాజువాక బాల చెరువు వైపు ఉన్న ప్లాంట్ గేట్ నుండి కార్మికులు గంగవరం పోర్టులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు సైతం రంగంలోకి దిగారు. దీంతో ఆప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. ఆందోళన చేస్తున్న కార్మికులు వెనక్కి వెళ్లేదే లేదని అక్కడే బైఠాయించారు. 1500 మంది స్టీల్ ప్లాంట్ కార్మికులు.. 1800 కాంట్రాక్టు కార్మికులు ఆందోళనలో పాల్గొన్నారు.