థర్డ్‌వేవ్ ప్రారంభ ద‌శ‌లోనే ఉన్నాం: టెడ్రోస్ హెచ్చ‌రిక‌!

జెనీవా (CLiC2NEWS): డెల్టా వేరియంట్ క‌రోనా వైర‌స్ విజృంభిస్తుండ‌టంపై డబ్ల్యూహెచ్ ఒ చీఫ్ టెడ్రోస్ ఆదోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోవిడ్ థార్డ్ వేవ్ ప్రారంభంలోనే ఉన్న‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ హెచ్చ‌రించారు.

జెనీవాలో టెడ్రోస్ మాట్లాడుతూ.. దుర‌దృష్ట‌వ‌శాత్తు మ‌నం క‌రోనా థార్డ్ వేవ్ ఆరంభ ద‌శ‌లో ఉన్నామ‌న్నారు. క‌రోనా వైర‌స్ నిరంత‌రం మారుతోంద‌ని, మ‌రింత ప్ర‌మాద‌క‌ర వేరియంట్లు ఉద్భ‌విస్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌స్తుతం డెల్టా వేరియంట్ వైర‌స్ 111 దేశాల్లో పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

కాగా ప్ర‌పంచంలోని అనేక‌ దేశాల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఏ వ్యాక్సినూ అంద‌లేద‌ని అన్నారు. ఇంకా చాలా దేశాల‌కు త‌గిన‌న్ని వ్యాక్సిన్లు అంద‌లేద‌న్నారు. అన్ని దేశాల్లో సెప్టెంబ‌రు నాటికి 10 శాతం మందికి అయినా వ్యాక్సిన్ వేయించేలా చ‌ర్య‌లు వేగిరం చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.