Health Tip: కడుపు నొప్పి
![](https://clic2news.com/wp-content/uploads/2021/04/bahar-ali-health-tips-3.jpg)
కడుపునొప్పి రావడానికి లక్షణాలు. ఈ వ్యాధిలో కడుపులో బరువుగా అనిపించడం మరియు సూదిగా గుచ్చటం వంటి నొప్పి ఉంటుంది. అపాన వాయువు, మలమూత్రాలు ఆగిపోతాయి. కొన్నిసార్లు అడపాదడపా నొప్పిగా ఉంటుంది. కొందరికి భోజనం తర్వాత నొప్పి ఉంటే, మరికొందరికి భోజనానికి ముందు నొప్పిగా ఉంటుంది. ఈ వ్యాధి కొన్నిసార్లు చాలా తీవ్రమైన రూపాన్ని తీసుకుంటుంది. దీని నివారణకు ఈ క్రింది చిట్కాని పాటించగలరు.
ఎండు అల్లం యొక్క మెత్తటి పొడిలో టీ స్పూన్, దానికి సమానం గా,ఉప్పు కలపండి. 1-1 మాత్ర పరిమాణంలో (చిటికెడు పౌడర్ ) గోరువెచ్చని గ్లాస్ నీటిలో ఉదయం, సాయంత్రం రెండు పూటలా తీసుకోండి.కడుపునొప్పి తక్షణమే తగ్గటం ప్రారంభిస్తుంది.
-షేక్ బార్ అలీ
ఆయుర్వేద వైద్యుడు