బాసర ఆర్‌జియుకెటిలో విద్యార్థి ఆత్మహత్య
బాసర (CLiC2NEWS): బాసర ట్రిపిల్ ఐటిలో ఓ విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్‌జియుకెటిలో పియుసి రెండో సంవత్సరం చదువుతున్న స్వాతిప్రియ సోమవారం తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందింది. అంతకుముందు తోటి స్నేహితులు టిఫిన్ చేయడానికి రమ్మన్నా ఆమె రానని చెప్పింది. స్నేహితులు తిరిగి వచ్చే సరికి ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించింది. విద్యార్థులు భద్రతా సిబ్బందికి తెలియజేశారు. వెంటనె స్థానిక ఆస్పత్రికి తరలించినా.. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థిని గదిలో పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. అమ్మానాన్నా నన్ను క్షమించండి. నా చావుకి ఎవరూ కారణంకాదు అంటూ లేఖలో రాసి ఉన్నట్లు సమాచారం.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పురపాలిక పరిధిలోని పెర్కిట్ గ్రామనికి చెందిన ఉజ్వల-రవీందర్ దంపతుల రెండో కుమార్తె స్వాతిప్రియ. విద్యాలయ అధికారుల నిర్లక్ష్యంతోనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. స్వాతిప్రియ గదిలో ఉంటున్న స్నేహితురాలికి , మరో విద్యార్థికి గొడవ జరిగిందని, దీనిపై తమ కుమార్తె గట్టిగా మాట్లాడితే ఆ విద్యార్థి స్వాతిప్రియను బెదిరించాడన్నారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేయించామని, తర్వాత ఆ విద్యార్థిని సస్పెండ్ చేశారన్నారు. విద్యార్థి బెదిరిస్తున్నా అధికారులు పట్టించుకోలేదని.. దీనివల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందిన తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలని ఎబివిపి నాయకులు ఆర్‌జియుకెటి వద్ద ఆందోళన చేస్తున్నారు.