ఉంగరం పోయిందని విద్యార్థిని బలవన్మరణం

వరంగల్ (CLiC2NEWS): వరంగల్ జిల్లాలో ఉంగరం పోయిందని నిండు జీవితాన్ని బలి తీసుకుంది ఓ విద్యార్థిని. ఈ ఘటన జిల్లాలోని దంతాలపల్లి మండలం గెన్నేపల్లిలో మంగళవారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు..
గెన్నేపల్లి గ్రామానికి చెందిన జానకి రాములు-రాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, పెద్ద కుమార్తె హేమలతారెడ్డి (19) హనుమకొండలోని ఓ ప్రైవేటు కాలేజీలో బీకాం సెకండీయర్ చదువుంతోంది. మరో కుమార్తెమరిపెడలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. కాగా ఉగాది పండుగ నేపత్యంలో ఈ నెల 20వ తేదీని హేమలతారెడ్డి ఇంటికొచ్చారు. బుధవారం తన చేతికి ఉన్న పావుతులం బంగారు ఉంగరం కనిపించకుండా పోయింది. దాని కోసం ఎంత వెతికినా కనిపించకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. గతంలో ఆరు నెలల కిందట బంగారు గొలుసు సైతం పోగొట్టుకున్నారు. ఇప్పుడు చేతి ఉంగరం కూడా దొరక్కుండా పోవడంతో తల్లిదండ్రులు మందలిస్తారనే భయంతో మనోవేదనకు గురయ్యారు.
`సారీ డాడీ.. నాకు భయమేస్తోంది.. అని లేఖరాసి సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సాయంత్రం పొలం నుంచి తిరిగి వచ్చిన తల్లి దండ్రులు తలుపు వేసి ఉండటంతో అనుమానం కలిగింది. దీంతో బలవంతంగా తలుపపులు తెరిచి చూడగా ఉరి వేసుకుని ఉంది. కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఘటనా స్థలంలో తండ్రికి రాసిన లేఖ దొరకడంతో స్వాధీనం చేసుకున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జగదీశ్ తెలిపారు.