రిక్షాను లాగే రోబోను త‌యారు చేసిన విద్యార్థులు

అహ్మ‌దాబాద్ (CLiC2NEWS): ఇంటిలో స‌హాయ‌ప‌డే రోబోలు, హోట‌ల్‌లో స‌ర్వ‌ర్‌గా ప‌నిచేస్తున్న రోబోల‌ను మ‌నం చూశాం. ఇపుడు రిక్షాను లాగే రోబోను త‌యారు చేశారు సూర‌త్‌కు చెందిన విద్యార్థులు.
న‌లుగురు విద్యార్థులు క‌లిసి శ్ర‌మించి రోబోను త‌యారు చేశారు. ఈ రోబో రిక్షాను లాగుతుంది. మ‌నిషి ఏవిధంగా రిక్షాను లాగుతాడో ప‌రిశీలించి వినూత్నంగా రిక్షాను లాగే రోబోను త‌యారు చేసిన‌ట్లు ఒక విద్యార్థి తెలిపాడు. బ్యాట‌రీ ద్వారా ఇది న‌డుస్తుంది. ఇపుడిది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. గ‌తంలో కూడా ప‌లు రంగాల్లో స‌హాయ‌ప‌డే రోబోల‌ను కూడా ఇత‌ను త‌యారు చేసిన‌ట్లు తెలిపాడు. దీనిని రోడ్డుపై ప్ర‌యోగాత్మ‌కంగా న‌డిపి చూపించాడు. దీని కోసం వారు 25 రోజులు శ్ర‌మించారని.. 30 వేల వ‌ర‌కు ఖ‌ర్చ‌యిన‌ట్లు తెలిపాడు. దీనిని మరింత‌గా అభివృద్ది చేయాల‌ని విద్యార్థి శివం వెల్ల‌డించాడు.

Leave A Reply

Your email address will not be published.