పరీక్షల కోసం విద్యార్థులను క్రేన్‌తో తరలింపు
![](https://clic2news.com/wp-content/uploads/2023/07/at-nandigama.jpg)
నందిగామ (CLiC2NEWS): హైదరాబాద్ – విజయవాడ జాతీయ రాహదారిపై నందిగామ వంతెన వద్ద మున్నేరు వరద ఉధృతిగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో వాహనాలు రాకపోకలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం డిగ్రీ కాలేజ్ సెమెస్టర్ ఎగ్జామ్స్ ఉండటంతో పరీక్ష రాసేందుకు విద్యార్థులు వచ్చారు. వరద ప్రవాహం ఉండటం వలన ఏ వాహనాలు వంతెన దాటే పరిస్థితి లేకపోయింది. దీంతో పోలీసులు క్రేన్ సహాయంతో విద్యార్థులను అవతలివైపుకు తరలించారు. మరోవైపు పల్లగిరి కొండ సమీపంలో గురువారం మధ్యాహ్నం మున్నేరు వరదల్లో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. వారిని ఎన్‌డిఆర్ ఎస్ బృందాలు సురక్షితంగా రక్షించినట్లు సమాచారం.