శుభాంశు శుక్లా వల్ల విలువైన సమాచారం వచ్చింది: ఇస్రో ఛైర్మన్
కర్నూలు (CLiC2NEWS): కర్నూలు ట్రిపుల్ ఐటి స్నాతకోత్సవానికి ఇస్రో ఛైర్మన్ నారాయణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. ఇస్రో ఆధ్వర్యంలో ఎన్నో అంతరిక్ష పరిశోధనలు కొనసాగుతున్నాయని తెలిపారు. శుభాంసు శుక్లాను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు పంపి క్షేమంగా తిరిగి రప్పించడం వలన గగన్ యాన్ మిషన్కు ఎంతో ఉపయోగకరమైన సమాచారం వచ్చిందని తెలిపారు. ఈ సంవత్సరాన్ని గగనయాన్ సంవత్సరంగా ప్రకటించామన్నారు. రాకెట్‌లో ప్రయాణం చేసేటపుడు అత్యవసర పరిస్థితులు ఏర్పడితే , క్షేమంగా బయటకు వచ్చేందుకు ప్రయోగం చేస్తున్నామని..దీని కోసం శుక్లా, ప్రశాంత్ నాయర్‌కు పది నెలల పాటు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. నాసా, ఇస్రో ఆధ్వర్యంలో 12 రాకెట్లను రూపొందిస్తున్నామని, దీనికి ప్రధానిమంత్రి నరేంద్రమోడీ అన్ని రకాలుగా ప్రోత్సాహం ఇస్తున్నారని నారాయణన్ వెల్లడించారు.