Sudan: బంగారు గని కూలి 38 మంది మృతి..
సూడాన్ (CLiC2NEWS): బంగారు గని కూలి ఘోర ప్రమాదం జరగింది. ఈ ప్రమాదంలో 38మంది చనిపోయారని అక్కడి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో మరో ఎనిమిది మంది గాయపడినట్లు తెలుస్తుంది. సూడాన్ రాజధాని ఖార్టోమ్‌కు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గని త్రవ్వకాన్ని గతకొంతకాలం నుండి ప్రభుత్వం మూసివేసింది. స్థానిక ప్రజలు బంగారం కోసం తరుచుగా గనిలోకి వెళుతుంటారు. మూసివేసిన గనిలో ఈ ప్రమాదం జరిగినట్లు సూడాన్ మైనింగ్ కంపెనీ తెలియజేసింది. ఆఫ్రికా ఖండంలో బంగారం వెలికితేసే దేశాల్లో సూడాన్ ప్రధాన ఉత్పత్తి దారుగా ఉంది. 2020 సంవత్సరంలో సూడాన్ 36.6 టన్నుల బంగారాన్ని వెలికితీసింది.