మూడు నెలల చిన్నారి స‌హా దంప‌తుల ఆత్మ‌హ‌త్య‌..

రంగారెడ్డి (CLiC2NEWS): జిల్లాలోని చేవెళ్ల మండ‌లంలో ఓ కుటుంబం ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. మూడు నెల‌ల చిన్నారి స‌హా భార్యాభ‌ర్తలు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న దేవ‌ర‌ప‌ల్లిలో మంగ‌ళ‌వారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. దేవర‌ప‌ల్లి గ్రామానికి చెందిన ఆశోక్‌, అంకిత భార్య‌భ‌ర్తలు.. వీరికి మూడు నెల‌ల చిన్నారి ఉంది. అశోక్ సోద‌రి నిశ్చితార్థం ఉండ‌టంతో చిన్నారితో స‌హా అంకిత దేవ‌ర‌ప‌ల్లికి వ‌చ్చింది. అశోక్ సోద‌రుడుతో క‌లిసి సోమ‌వారం రాత్రి కూర‌గాయ‌ల‌ను ఆటోలో మార్కెట్‌కు తీసుకెళ్లి తిరిగి తెల్ల‌వారుజామును 4 గంట‌ల‌కు ఇంటికి వ‌చ్చారు. అక్క‌డ‌నుండి సోద‌రుడు వెళ్లిపోయిన‌ అనంత‌రం వారు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు స‌మాచారం. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు.

Leave A Reply

Your email address will not be published.