విజయవాడలో ప్రముఖ వైద్యుడు సహా కుటుంబ సభ్యుల ఆత్మహత్య!
![](https://clic2news.com/wp-content/uploads/2021/01/dead-body.jpg)
విజయవాడ (CLiC2NEWS): ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందిన ఘటన మంగళవారం విజయవాడలో చోటుచేసుకుంది. నగరంలో నివాసముంటున్న ప్రముఖ ఆర్ధోపెడిక్ వైద్యుడు డి. శ్రీనివాస్ తో పాటు భార్య, పిల్లలు, తల్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఉదయం పనిమనిషి శ్రీనివాస్ ఇంటికి వచ్చి చూడగా.. బాల్కనీలో శ్రీనివాస్ ఉరేసుకుని కనిపించడంతో చుట్టుపక్కల వారికి, పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మరణించిన వారి గొంతులు కొసి ఉన్నట్లు వారు గుర్తించారు. శ్రీనివాస్ ఇటీవల ఆస్పత్రి పెట్టారు. నష్టాలు రావడంతో దాన్ని అమ్మేశారు. అప్పటి నుండి ఆర్ధిక ఇబ్బందులతో ఉన్నట్లు తెలుస్తోంది.