హైదరాబాద్లో భార్యభర్తల ఆత్మహత్య!

హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్లోని కూకట్పల్లిలో భార్యభర్తలు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక ఎస్సై చంద్రకాంత్, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కూకటిపల్లి వెంకట్రావునగర్ కాలనీలోని రోడ్డు నంబరు 9లోని ఒక ఇంటిలో సోమిరెడ్డి (65), మంజుల (56) భార్యభరలు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు.. వారిలో మియాపూర్లో పెద్ద కొడుకు, ఫారెన్లో మరో కొడుకు ఉంటున్నారు.

కాగా గాజుల రామారంలో ఉంటున్న మంజుల సోదరుడు సోమిరెడ్డికి ఎన్ని సార్లు ఫోన్ చేసినా తీయక పోవడంతో.. అనుమానం వచ్చి స్వయంగా ఆయన వచ్చి చూడగా ఇద్దరు విగతజీవులై ఉన్నారు. మంజుల ఉరి వేసుకోగా, సోమిరెడ్డి నేలమీద ఉన్నాడు. సోమిరెడ్డి నోటి నుంచి నురగలు రావడాన్ని బట్టి ఏదైనా పురుగుల మందు తాగి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్య కారణాలతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.