సన్ పెట్రో కెమికల్స్‌తో భారీ పెట్టుబడులకు ఒప్పందం
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రానికి భారీ పెట్టుబడులపై దావోస్‌లో కీలక ఒప్పందం జరిగింది. సన్ పెట్రో కెమికల్స్ రూ.45వేల కోట్లపెట్టుబడులతో ఎంఒయు కుదుర్చుకుంది. . ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.45,500 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో నాగర్ కర్నూల్, మంచిర్యాల , ములుగు ప్రాంతాల్లో ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయిభారీ పంప్డ్ స్టేరేజ్ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుపై ఒప్పందం జరిగింది. ఈ ప్రాజెక్టులతో రాష్ట్రంలోని 7 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు సమాచారం. సిఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.
రవాణా రంగంలో పెట్టుబడులకు ముందుకు రావాలి: సిఎం రేవంత్ రెడ్డి