నెద‌ర్లాండ్స్‌పై సూప‌ర్ విక్ట‌రీ

అజేయంగా సెమీస్‌కు టీమిండియా

బెంగ‌ళూరు (CLiC2NEWS): దీపావ‌ళి వేళ టీమిండియా అభిమానుకు మంచి ట్రీట్ ఇచ్చించి. ప్ర‌పంచ‌క్ లీగ్‌ద‌శ‌లోని చివ‌రి మ్యాచ్‌లో టీమిండియా సూప‌ర్ విక్ట‌రీ సాధించింది. ఆదివారం బెగ‌ళూరు వేదిక జ‌రిగిన నెద‌ర్లాండ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నీర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 410 ప‌రుగులు సాధించింది. ఈ భారీ ల‌క్ష్యాన్ని ఛేదించ‌డంలో నెద‌ర్లాండ్స్ బ్యాట‌ర్లు బోల్తా ప‌డ్డారు. కేవ‌లం 250 పరుగుల‌కే ఆలౌట‌యింది. నెద‌ర్లాండ్స్ బ్యాట‌ర్ల‌లో తేజ నిడ‌మ‌నూరు 54, ఎంగెల్ బ్రెచ్ట్ 45 ప‌రుగుల‌తో రాణించారు. భార‌త బౌల‌ర్లు మంచి లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగే వేసి నెద‌ర్లాండ్స్ బ్యాట‌ర్ల‌ను క‌ట్ట‌డి చేశారు. బుమ్రా, సిరాజ్‌, కుల్‌దీప్ యాద‌వ్‌, జ‌డేజా త‌లో రెండు వికెట్లు తీశారు. కింగ్ కోహ్లీ , కెప్టెన్ రోహిత్ శ‌ర్మ చెరో వికెట్‌తో రాణించారు.

అంత‌కు ముందు టాస్ గెలిసి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్ ఓప‌న‌ర్లు రోహిత్ శ‌ర్మ 61, శుభ్‌మ‌న్ గిల్ 51 ప‌రుగుల అద్భుత ఆరంభాన్నిచ్చారు. త‌రువాత వ‌చ్చిన విరాట్ 51 ప‌రుగుల‌తో రాణించారు. త‌రువాత బ్యాటింగ్‌కు వ‌చ్చిన కె ఎల్ రాహుల్‌తో క‌లిసి శ్రేయ‌స్ ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. వీరిద్ద‌రు నాలుగో వికెట్‌కు 208 ప‌రుగుల భారీ భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. కెఎల్‌రాహుల్ అవుట‌వ‌గా వ‌చ్చిన సూర్య‌కుమార్ యాద‌వ్ 2 ర‌న్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు.

Leave A Reply

Your email address will not be published.