SSMB: సూప‌ర్ స్టార్‌- త్రివిక్రమ్ సినిమా అప్డేట్​ వచ్చేసింది..

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీ ‘ఎస్ఎస్ఎంబి28’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ను తాజాగా మ‌హేష్ బాబు బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిత్రబృందం వెల్లడించింది. కథానాయికతో పాటు, సాంకేతిక బృంద వివరాలను ప్రకటించింది. ఈ చిత్రంలో మహేష్​ సరసన పూజా హెగ్డే సందడి చేయనుంది. ఎ.ఎస్‌.ప్రకాశ్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌గా, నవీన్‌ నూలి ఎడిటర్‌గా, మది సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తారు. హారిక అండ్​ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు)ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘అతడు’ (2005), ‘ఖలేజా’ (2010) చిత్రాల తర్వాత మహేశ్‌బాబు- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో  వస్తున్న మూడో చిత్రం ఇది. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్‌ రిపీట్‌ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం మహేశ్‌బాబు పరుశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.