రాష్ట్రాన్ని ఆదుకోండి.. ప్రధాని మోడికి సిఎం జగన్ వినతి
ఢిల్లీ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాన మంత్రి నరేంద్రమోడికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పరిస్థితులపై కేంత్ర ప్రభుత్వ అధికారులతో చర్చించాడానికి ఢిల్లీ వచ్చిన సిఎం జగన్ ప్రధాని నరేంద్ర మోడితో సమావేశమయ్యారు. పోలవరం సవరించిన అంచనాలు, రేషన్ పెంపు, భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుమతులు, కడప స్టీల్ ప్లాంట్, రెవెన్యూలోటు భర్తీ, తెలంగాణ నుంచి విద్యుత్తు బకాయిలు, రాష్ట్ర రుణ పరిమితిపై వెసులుబాటు కల్పించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.