2021-22 నీట్ పిజి కౌన్సెలింగ్‌కు సుప్రీంకోర్టు అనుమతి
ఢిల్లి (CLiC2NEWS): నీట్ పిజి కౌన్సెలింగ్‌కు ఉన్నత న్యాయస్థానం అనుమతి నిచ్చింది. 2021-22 సంవత్సరానికి నీట్ పిజి ప్రవేశాలకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే కౌన్సెలింగ్ నిర్వహించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒబిసిలకు 27%, ఈడబ్ల్యూ ఎస్‌లకు 10% రిజర్వేషన్‌కు ధర్మాసనం అనుమతిచ్చింది. వార్షికాదాయం 8లక్షల లోపు ఉన్నవారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తింప జేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
పిజి వైద్యవిద్య ప్రవేశాల్లో 8 లక్షల వార్షిక ఆదాయం కంటే తక్కువ ఉన్నవారు ఈడబ్ల్యూఎస్ కోటాకు ఆర్హులంటూ గత సంవత్సరం జూలైలో కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ పిజి వైద్య విద్యార్థులు సుప్రీంకోర్గును ఆశ్రయించారు. ఈమేరకు ఉన్నత న్యాయస్థానం శుక్రవారం తీర్పు నిచ్చింది.